రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలన్న సీఎం ఆలోచనను స్వాగతిస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళలో సరైన సౌకర్యాలు లేవని.. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీచర్లు లేరని గత ప్రభుత్వం పాఠశాలలను మూసేసిందని గుర్తు చేశారు. మూసేసిన పాఠశాలలను మళ్ళీ తెరుస్తామన్నారు. ఏకోపాద్యాయ స్కూళ్లను రద్దు చేయాలని సీఎం హామి ఇచ్చారన్నారు. రూ.2 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనను స్వాగతిస్తున్నా : ఎంపీ మల్లు రవి
