జగన్ ఏపీ ప్రభుత్వానికి సవాళ్లు..

ys-jagan-26-1.jpg

రాష్ట్రంలో ప్రజలు బయటకు రాకుండా, ప్రశ్నించకుండా, హత్యా రాజకీయాలు చేస్తున్నారు. అలా వారిని భయపెడుతున్నారు. అలాంటి భయానక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. చంద్రబాబుకు ఒక మోడస్ అపరెండి ఉంటుంది. అది ఒక వంచన. దగా, మోసం. ఒక మనిషిని అప్రతిష్ట పాల్జేయడం. ప్రచారం చేసుకోవడం ఆయనకు అలవాటు. తాను ఎంచుకున్న, టార్గెట్‌ చేసిన వ్యక్తిపై విమర్శలు. దానిపై అందరూ మాట్లాడతారు. ఆ తర్వాత అనుకూల ఛానళ్లలో చర్చలు. వాటిలో నిశిత విమర్శలు. అంతా చేసి, చివరకు ఏం కంక్లూజన్ ఇస్తారంటే.. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. కాబట్టి చంద్రబాబు చేస్తోంది మంచి అనిపిస్తారు. ఆనాడు ఎన్టీఆర్‌ను గద్దె దింపడం మొదలు.. ఆ తర్వాత బీజేపీని తిట్టడం, మళ్లీ దగ్గరకు వెళ్లడం. మధ్యలో మరో పార్టీకి చేరువ కావడం. తాను ఏది చేసినా, అది మంచిదే అన్నది చెప్పుకుంటారు. 

దాన్ని అందరితో ఔను అనిపించుకోవడం కోసం ట్రై చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు తాజాగా ఎంచుకున్న విషయం. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. అంత అరాచకం ఉంది. దానికి కారణం మా ప్రభుత్వం అని నిందిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయాయని ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు ఏమని ప్రచారం చేశారు? రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లు అని విపరీతంగా దుష్ప్రచారం చేశారు. మరోవైపు.. లెక్కకు మించి హామీలు.. సూపర్‌ సిక్స్‌ అంటూ హామీలు ఇచ్చారు. ఎన్నికల తరవాత, హామీలు అమలు చేయాల్సి రావడంతో.. చంద్రబాబు మరో మోడస్‌ ఆపరెండికి దిగారు. రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లు లేకున్నా.. అలా చూపాలని చాలా ప్రయత్నం చేశారు. అది సాధ్యం కావడంతో.. రూ.10 లక్షల కోట్లు అప్పు అన్నారు. దాన్నే గవర్నర్‌గారి ప్రసంగంలో చెప్పించారు. పచ్చి అబద్దాలు చెబుతున్న చంద్రబాబు, గవర్నర్‌ ప్రసంగంలో కూడా అవే చెప్పించారు. రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెడితే, అన్ని వివరాలు స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి, ఆ పని చేయడం లేదు” అని జగన్ అన్నారు.

Share this post

scroll to top