ఒకరు కేబినెట్ బెర్త్, మరొకరు పీసీసీ పగ్గాలు కీలక పదవులపై ఆ జిల్లా నేతల ఆశలు..

CONG-03.jpg

ఒకరు కేబినెట్ బెర్త్, మరొకరు పీసీసీ పగ్గాలు.. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇద్దరు నేతలు కీలక పదవులు ఆశిస్తున్నారు. ముదిరాజుల కోటాలో మక్తల్ ఎమ్మెల్యే, దళిత కోటాలో సంపత్ కుమార్‎లు ఆయా పదవుల కోసం పోటీ పడుతున్నారు. అయితే ఎవరికి అదృష్టం వరించినా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం పెరుగుతుందని హస్తం క్యాడర్ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు పాలమూరు జిల్లా నేతలు పోటీ పడుతున్నారు. ఇటీవలే విస్తృత చర్చగా మారిన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు, కెబినెట్ బెర్త్ కోసం ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కోరుతున్నారు. ఇందుకు సామాజిక సమీకరణాలను ముందుంచి పావులు కదుపుతున్నారు. ఒకరు పార్టీలో కీలకంగా ఉండి రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉంటే.. మరొకరు ఆ సామాజిక వర్గం నుంచి రాష్ట్రంలోనే గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. అలంపూరు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పీసీసీ అధ్యక్షుడి పదవిని ఆశిస్తున్నారు. 2014 నుంచి 2018వరకు అలంపూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2018 – 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఇటీవలె జరిగిన ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి బరిలో నిలవాలని భావించారు. కానీ అధిష్టానం మల్లు రవికి టికెట్ కేటాయించింది. అయితే ఈ సారి పీసీసీ పగ్గాల విషయంలో అధిష్టానం సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తున్న నేపథ్యంలో ఎస్సీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారట. ఇప్పటికే ఏఐసీసీ సెక్రటరీగా జాతీయ స్థాయిలో పనిచేసన అనుభవం ఇందుకు కలిసొస్తుందని భావిస్తున్నారట.

Share this post

scroll to top