కాంగ్రెస్ రైతు రుణమాఫీ పేరుతో ప్రజలను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. రైతుల అరెస్ట్ అన్యాయమని వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
రుణమాఫీ పేరుతో ప్రజలను నట్టేట ముంచింది కాంగ్రెస్..
