ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి? అని మండిపడ్డారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన తిరుపతిలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, భారత్ కు ట్రంప్ సలహాలు అవసరం లేదన్న ఆయన అసలు ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి? అని నిలదీశారు మరోవైపు, అఖిలపక్షం ఏర్పాటు చేస్తే మోడీ ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశానికి వస్తే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనే భయం ప్రధాని మోడీలో ఉందన్నారు రాజా
ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి..
