బుడమేరు వరదలకు కారణం కొల్లేరు.. 

narayana-26-.jpg

విజయవాడలో గత నెలలో సంభవించిన బుడమేరు వరదలకు కారణం కొల్లేరు ఆక్రమణలే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కొల్లేరు ఆక్రమణలపై తాము పోరాడి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఫిర్యాదు చేయగా నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. కొల్లేరు సరస్సు ఆక్రమణలపై నాటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ఉన్న లవ్ అగర్వాల్ ఫిష్ మాఫియా టార్గెట్ చేసిందన్నారు. ఆయనకు ఎలాంటి హాని జరగకుండా తామే అండగా నిలిచామన్నారు. ప్రస్తుతం ఐఏఎస్ లవ్ అగర్వాల్ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్నారని సీపీఐ నారాయణ తెలిపారు.

Share this post

scroll to top