దావోస్‌లో సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటన..

cbn-22.jpg

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లో మూడో రోజు పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మూడవ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధినేతలతో సీఎం సమావేశం కానున్నారు. బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ ఇవాళ సీఎం చర్చలు జరపనున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది.

ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించనున్నారు. గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా త్వరలోనే ఏపీ మారనున్నదని చంద్రబాబు తెలిపారు. సౌర, పవన, గ్రీన్‌ హైడ్రోజన్‌ విద్యుదుత్పత్తిపై దృష్టి కేంద్రీకరించామని, ఈ రంగాల్లో 115 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని చెప్పారు.

Share this post

scroll to top