ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం లో పర్యటించనున్నారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గాలలో కూడా డిప్యూటీ సీఎం పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలోనే రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రారంభించనున్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి స్థానిక అధికారులతో సమీక్ష కూడా నిర్వహించనున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు కూడా విడుల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక పర్యటన అనంతరం గొల్లప్రోలులో ప్రత్యేకంగా మీడియా తో మాట్లాడనున్నారు. కాగా పవన్ కల్యాణ్ పర్యటన రేపు కూడా ఈ నియోజకవర్గాల్లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పర్యటన..
