అనారోగ్య సమస్యల్ని ఇట్టే దూరం..

chiri-5.jpg

చెర్రీ పళ్ళు ఈ పళ్ళ గురించి మీ అందరికీ తెలుసు. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు కూడా అవసరం లేదు. ఈ పళ్ళు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగకరం. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. చెర్రీలను తినటం వలన వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని ఇట్టే దూరం చేసుకోవచ్చని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఇవి తినటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుకోవచ్చు.

విటమిన్ సి –

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అనారోగ్యం కలిగినప్పుడు వ్యాధులతో పోరాడే శక్తి మీకు సత్వరమే లభిస్తుంది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులు, వాపులను కూడా తగ్గించడానికి చెర్రీలు ఎంతగానో దోహదం చేస్తాయి. నిద్రలేమి సమస్యలతో బాధపడే వారు, రోజుకు కొన్ని చెర్రీలను తినడం వలన నిద్ర బాగా పడుతుంది. చెర్రీ పళ్ళనే కాకుండా వాటితో చేసిన జ్యూస్ ను తాగినా నిద్ర హాయిగా పోవచ్చు.

చెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఉండటం వలన మీ శరీరంలోని అధిక వేడిని తొలగిస్తుంది. దీంతో పాటుగా.. ముఖ్యంగా శరీరంలో ఉండే ‘అధిక కొలెస్ట్రాల్’ ను వెన్నలా.. కరిగించేస్తుంది. దీని వల్ల మీరు గుండె జబ్బుల ప్రమాదం నుండి బయటపడతారు. వీటన్నిటితో పాటూ చెర్రీలలో ఉండే ఆంథోసైనిన్స్ అనే ఒక రకమైన వర్ణకాలు ఉండటం వల్ల, ఇవి మెదడు యొక్క కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. ఫలితంగా మతిమరుపు అల్జీమర్స్ సమస్యలు రాకుండా ఉంటాయి. చెర్రీ పళ్ళు తినటం వలన వృద్ధాప్యం దరిచేరదు, యవ్వనంగా కనిపిస్తారు. ఇవే కాకుండా చెర్రీలను తినటం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

Share this post

scroll to top