విగ్రహాన్ని ఈ సమయంలోనే పెట్టాలి..

ganesh-6-1.jpg

ఈ ఏడాది వినాయక చవితిని సెప్టెంబర్ 7వ తేదీ శనివారం జరుపుకోనున్నాం. అయితే చవితి రోజున వినాయక చవితి విగ్రహాంను ఏ సమయంలో పూజ మందిరంలో పెట్టుకోవాలి, ఏ సమయంలో పూజను చేసుకోవాలని జ్యోతిష్య పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. మరీ అవేంటో చూద్దాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. వినాయక చవితిని నాడు గణపతి విగ్ర హ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం ఆ రోజు ఉదయం 11.03 గంటల నుంచి మ.1.30 గంటల మధ్యలో  ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఒకవేళ ఆ సమయంలో వీలు కాకపోతే మరలా సాయంత్రం 6.22 గంటల నుంచి రా.7.30 మధ్యలో వరసిద్ధి వినాయకుడిని ప్రతిష్ఠించి వ్రత సంకల్పం చేసుకోవచ్చని తెలిపారు.

కనుక చవతిరోజున ఆ సమయాల్లో గణపతి విగ్రహా ప్రతిష్ఠ చేసి భక్తి, శ్రద్ధలతో నియమ నిష్టలతో వినాయకుడిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలిగి శుభలే జరుగుతాయని పండితులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ మహా గణపతి కి ఎరుపు రంగు వస్త్రాలంటే ఎంతో ఇష్టం కాబట్టి వినాయక చవితి రోజున ఆ రంగు వస్త్రాలు ధరించి పూజిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది శనివారం రోజున వినాయక చవితి వచ్చింది కనుక ఆ వారానికిక అధిపతి శనేశ్వరుడు, అందుకే ఆయనకు ఇష్టమైన నీలం రంగు దస్తులు ధరించి పూజించిన మంచిదని పండితులు చెబుతున్నారు.

Share this post

scroll to top