యాంటీ బయోటిక్‌ల వాడకం పెరిగితే ఏమౌతుందో తెలుసా..

bio-09.jpg

పూర్వం ఏదైనా వ్యాధి వస్తే.. ప్రకృతి వైద్యంపై ఆధారపడేవాళ్లు.. మన చుట్టుపక్కల్లో దొరికే చెట్లు, మూలికలతో వైద్యం చేసేవాళ్లు. కానీ..ప్రస్తుతం ఆంగ్ల మందులకు అలవాటు పడిపోయాం. ఏ చిన్న సమస్య వచ్చినా దానికి తగ్గ మందులు వేసుకుంటున్నాం. ఆ మందులు వేసుకోగానే.. ఉన్న సమస్య తగ్గి కొత్త సమస్యలు పుట్టుకొస్తాయన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాం. మనం తీసుకునే ప్రతి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లకు కారణమవుతోంది. ఇప్పుడు యాంటీ బయోటిక్ మందులు వాడటం వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ప్రపంచం వ్యాప్తంగా 2000 సంవత్సరం నుంచి యాంటీ బయోటిక్ మందుల వాడకం 76 శాతం పెరిగిందని చెబుతున్నారు. అంతకు ముందు ఏదైన చిన్న అనారోగ్య సమస్య వస్తే లవంగాలు, సొంటి లాంటి ఇంట్లో వున్న వస్తువలతో ఆరోగ్య చిట్కాను పాటించేవారు. కానీ ప్రస్తుతం అన్నింటికీ యాంటీ బయోటిక్‌లను తీసుకుంటున్నారు. శరీరంలో క్రిములు ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తున్నప్పుడు దాన్ని నిరోధించడానికి తెల్లరక్తకణాలు ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షను బంధించడానికి కొన్ని రకాల యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి.

Share this post

scroll to top