ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ మార్గదర్శకాలు రైతులకు ఉరితాళ్లుగా మారాయన్నారు.నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యక్తిగతంగా వివిధ కారణాలతో అనేక మంది రైతులు తమ రుణాలను రీ షెడ్యూల్ చేసుకున్నారని, ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకున్నారని వారందరికీ ఇప్పుడు రుణమాఫీ చేయబోమని షరతు విధించడం సరికాదన్నారు. అధికారం ఇచ్చారు కాబట్టి ఐదేళ్లు ఏదైనా చేయవచ్చు అనే అహంకారం రేవంత్ రెడ్డి సర్కార్ లో కనిపిస్తున్నదని మోసం చేసేవాళ్లకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నారు.. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల మెట్ట పొలం ఉన్న వారికి రేషన్ కార్డు ఇవ్వరు. ఈ విషయం తెలియదా? రేవంత్ రెడ్డి చదువుకున్నారా? అని ప్రశ్నించారు.
లోన్ల రీ షెడ్యూల్ పై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు..
