చెడు కొలెస్ట్రాల్‌ను వదిలిస్తుంది:
కాల్చిన బాదంపప్పులను తినడం వల్ల హై డెన్సిటీ లిపోప్రొటీన్ అంటే మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాదంపప్పులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఇది తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. HDLని కూడా ప్రోత్సహిస్తుంది.
ఎముకల ఆరోగ్యం:
ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయి. బాదంపప్పులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఇతర ముఖ్యమైన పోషకాలు ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి. దీంతో ఎముకలు దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి.
బీపీని నియంత్రిస్తుంది:
వేయించిన బాదం బీపీ పేషెంట్లకు చక్కని అల్పాహారం. వీటిలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. డాక్టర్ సలహా ప్రకారం, బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనేక ఇతర ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలను కూడా అందించవచ్చు.
ఆరోగ్యకరమైన చర్మం:
బాదంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది ముడుతలను తగ్గించి, చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అంతే కాకుండా అవి చర్మాన్ని లోపలి నుండి పోషించి ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో మీ చర్మం సహజంగా మెరుస్తూ ఉంటుంది.