ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమీ చేయకపోయినా తన అనుకూల మీడియా ద్వారా హీరోలా చూపించుకుంటున్నారని, వాస్తవానికి ఆయన ఓ విలన్ అని గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్నా విలన్ లాగే వ్యవహరించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. శనివారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు..
