30 రోజుల పాలన.. ‘చంద్ర’ మోసం అప్పుడే మొదలైంది..

amar-12.jpg

నాలుగు సార్లు సీఎం ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమి చెయ్యకుండా ఇప్పుడు చవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికే పరిమితమై పరిపాలన కొనసాగించారని దుయ్యబట్టారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి కావాల్సిన అనుమతులు అన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చి పనులు మొదలు పెడితే ఇప్పుడు వచ్చి చంద్రబాబే అన్ని తానే చేసినట్లు మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఏమి చెయ్యకుండా అన్ని తనే చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకి ఆయనే సాటి.. దేశంలో చంద్రబాబుకి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ దేశంలో ఎవరికి వుండవు‘‘ అంటూ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు.

Share this post

scroll to top