మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రాజీవ్ అరెస్టును మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల్ని అక్రమ అరెస్టులు చెయ్యడానికే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులని నొక్కే పనితప్ప ప్రజలకి ఉపయోగపడేది ఒక్కటి చెయ్యలేదు. 60 రోజుల్లో ఒక్క పథకం అమలు చెయ్యకుండా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జోగి రాజీవ్ అరెస్టుపై పేర్ని నాని ఫైర్..
