APPS అంటే ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ సర్వీస్ ను ఆంధ్ర ప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ గా మార్చేశారు అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి విడదల రజిని. ఇవాళ మీడియాతో మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ మాకు పోలీసులు అంటే అపారమైన గౌరవం ఉందన్నారు. APPS అంటే ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ సర్వీస్ ను ఆంధ్ర ప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ గా మార్చేశారు అని వివరించారు మాజీ మంత్రి విడదల రజిని.
ఎల్లకాలం ఈ ప్రభుత్వం అధికారంలో ఉండదు అని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ స్ఫూర్తితో కక్షలు లేకుండా గుడ్ గవర్నెన్స్ ఇచ్చారన్నారు. అదే అంబెడ్కర్ ఇచ్చిన రాజ్యాంగా స్పూర్తితో అత్యుత్సహం చూపిస్తూ మా వైసీపీ నాయకులు,కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్న అధికారులు పోలీసులను అదే అంబేద్కర్ గారి స్పూర్తితో చట్టం ముందు నిలబెడతాం అని చెప్పారు మాజీ మంత్రి విడదల రజిని.