అధికారులు తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరుకుంటున్నా..

teja-3.jpg

విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీ సమీపంలో ఉన్న ఓ కుటుంబం వరదల్లో చిక్కుకుంది.  ఈ క్రమంలో తమని కాపాడండి అంటూ చైతన్య అనే వ్యక్తి అధికారులను కోరారు. వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ కొత్తగా నిర్మితమవుతున్న ఫ్లై ఓవర్ కి మధ్యలో తమ ఇల్లు ఉందని రైతు బజార్ ఆపోజిట్ లేన్ లో మూడవ బిల్డింగ్ లో ఉంటున్నామని అన్నారు. అమూల్ ఐస్ క్రీమ్ అనే ఒక పెద్ద బోర్డు ఉంటుందని ఆ బిల్డింగ్ లో హార్ట్ పేషెంట్, పది రోజుల క్రితం పుట్టిన బాబు, బాలింత, ఇద్దరు పసి పిల్లలు, తొమ్మిది మంది ఆడవాళ్లు, నడవలేని వాళ్ళు అందరం ఇరుక్కుపోయామని అన్నారు.

దయచేసి అధికారులు తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరుకుంటున్నా అని తెలిపారు. గత మూడు రోజుల నుంచి తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేవని పిల్లలకు పాలు కలపడానికి కూడా నీళ్లు లేవని అన్నారు. ఎంతోమంది అధికారులకు వాట్సాప్ లో మెసేజ్ చేశానని, కాల్ కూడా చేశానని అన్నారు. తన మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయే పరిస్థితికి వచ్చిందని దయచేసి వీలైనంత త్వరగా అధికారులు తమకు సాయం చేయండి, సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లండి అంటూ వేడుకున్నారు. ఈ వీడియోని బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ టేస్టీ తేజ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

Share this post

scroll to top