ల్యాండ్ టైటిలింగ్‌ యాక్టు రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఆమోదించింది..

land-title-24.jpg

ఏపీ కేబినెట్ మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్‌ యాక్టు రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఆమోదించింది. దీంతో పాటుగా మరో కీలక బిల్లను ఏపీ కెబినెట్ ఆమోదించింది. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ బిల్లులను కూడా శాసనసభ ఆమోద ముద్ర వేసింది. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ లైటింగ్ యాక్ట్‌ని తామతు అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నట్లు సంతకం చేశారు. తాజాగా ఆ బిల్లును కూటిమి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టగా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.

Share this post

scroll to top