రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో వివిధ జిల్లాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్‌లు తరలివచ్చారు. రాజకీయ కారణలతో తమను ఉద్యోగాల నుంచి తొలగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం ఉదయం విజయవాడలోని పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లను అక్రమంగా తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. ఇదే సమయంలో తొలగింపులు ఆపాలని ఫీల్డ్ అసిస్టెంట్స్ డిమాండ్ చేశారు. కాగా, ఓ రాజకీయ కారణాలతోనే తమను విధుల నుంచి తొలగిస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమతో రాజకీయం చేయవద్దన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
టీడీపీ కక్ష సాధింపు.. రజకీయ కారణలతో తమను ఉద్యోగాల నుంచి తొలగించడమేంటి..
