ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సరైన సమయానికి అగ్నిమాపాక సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ముఖ్యమైన ఫైల్స్ ఏమైనా దగ్ధం అయ్యాయా? అన్న విషయం తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బందిని తప్పా ఎవరినీ కార్యాలయం లోపలికి అధికారులు అనుమతించడం లేదు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, చీఫ్ సెక్రటరీ తదితరులు కొద్ది సేపట్లో నిధి భవన్ ను సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీ ఆర్థిక శాఖ హెడ్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం..
