ఎన్నికల్లో గెలిచిన 40 రోజుల్లోనే నెల్లూరులో అద్దెకు ఉంటున్న ఇంటిని కొన్నవంటేనే గతంలో ఎంత సంపాదించి ఉండాలి. ఏపీ జెన్కో ఫ్లై యాష్ నుండి, ఇసుక అక్రమ రవాణా నుండి, ఇతరుల భూములు కొలగొట్టడం నుండి, నువ్వు సంపాదించిన అక్రమ ఆస్తి లెక్క చెప్పగలవా! నీ నీచ, నికృష్టపు రాజకీయాలు మానుకో సూరాయపాళెం లో ఇసుకలో 100 కోట్లు కాజేద్దాం అనుకుంటున్నావు. నీ లాంటి రాజకీయ నాయకుడిని సర్వేపల్లి ప్రజలు కాదు కదా, జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఇంత వరకు చూడలేదు. అందుకే నిన్ను 20 సంవత్సరాలు ప్రజలు దగ్గరికి రానివ్వకుండా తరిమి కొట్టారు. నీ అవినీతి సొమ్ముకు ఆశ పడి పొదలకూరులో చెంచాగిరి చేసే వాళ్ళు దొరుకుతారు. పాపం! నువ్వు ఇచ్చే బిస్కెట్లకు కక్కుర్తి పడి, అసభ్యకర పదజాలం వాడుతూ నీ పరువును మరింత దిగజార్చుతున్నాయి. నువ్వేమో నీ గురించి పొగడుతూ వాట్సప్ లలో వ్రాయమని బిస్కెట్లు వేస్తే ఇక్కడ చూస్తే నీ గురించి రాయలేక, ప్రజలు నీ మీద ఉమ్మేసే విధంగా బూతులు రాస్తున్నాయి.
సోమిరెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన పోస్టింగులు పెట్టించి, ఆనందపడాలని చూస్తే..
