నిరుద్యోగ భృతి అమలవుతుందా..

chathisgad-3.jpg

ఆంధ్రప్రదేశ్‌కి సరిహద్దున ఛత్తీస్‌గఢ్ ఉంది. అది ఏపీ కంటే పేద రాష్ట్రం. అక్కడి సీఎం భూపేష్ భగేల్ నిరుద్యోగ భృతిని అమలుచేశారు. నెలకు రూ.2,500 ఇచ్చే బేరోజ్‌గారీ బత్తా పథకాన్ని 2023 ఏప్రిల్ 1న ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో నిరుద్యోగులు నెల నెలా భృతి పొందుతున్నారు. అలాగే మరో రాష్ట్రం మహారాష్ట్ర కూడా మొన్ననే నిరుద్యోగ భృతి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఏపీలో ప్రభుత్వం మొన్ననే అధికారంలోకి వచ్చింది. కానీ నిరుద్యోగులు చాలా ఏళ్లుగా ఉన్నారు. వారికి అర్జెంటుగా మనీ కావాల్సి ఉంది. అందువల్ల వారు నిరుద్యోగ భృతి ఎప్పుడు అమలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆర్థిక శాఖపై ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం ప్రకారం.. ఏపీ అప్పుడు రూ.9లక్షల 74వేల కోట్లకు పైగా ఉంది. ఇది కాకుండా వేరే ఇతర అప్పులు మరో రూ.2 లక్షల కోట్ల దాకా ఉన్నాయి. ఈ అప్పుల వల్ల ఏపీ ప్రభుత్వం రోజుకు, అప్పులపై వడ్డీ కింద రూ.200 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అమలు చెయ్యగలదా, నెలకు రూ.3,000 చొప్పున భృతి ఇవ్వగలదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Share this post

scroll to top