ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రూ.2, 94, 427.25 కోట్లతో ఆయా శాఖలకు కేటాయింపులు జరిపింది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శలు కురిపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సర్కార్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాదిరిగానే ఇప్పటి వరకూ కొనసాగించడడాన్ని ఆయన తప్పు బట్టారు. తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బడ్జెట్ ప్రవేశ పెట్టామని గుర్తు చేశారు. కరోనా లాంటి విపత్కర సమయంలోనూ బడ్జెట్ ఆపలేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఐదే నెలలపాటు బడ్జెట్ పెట్టలేదని చెప్పారు. ఇంత అనుభవం ఉన్నా బడ్జెట్ ఎందుకింత ఆలస్యమైందని ప్రశ్నించారు. ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వానికి గెలిపించారని, ఇంటింటికి తిరిగి చాలా హామీలు ఇచ్చారని, ఈ బడ్జెట్‌తో ప్రజ ఆశలు అడియాశలయ్యాయని బుగ్గన విమర్శించారు.
ఏపీ బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన విమర్శలు..
