పిన్నెల్లిపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. 

rambabu-28.jpg

పిన్నెల్లిపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఘటన జరిగిన 9 రోజుల తర్వాత కేసులు పెట్టడం.. ఈవీఎం ధ్వంసం వీడియో ప్రస్తుత మంత్రి లోకేష్‌కి లీక్ కావడాన్ని బట్టి చూస్తే అది అర్థమవుతుందన్నారు. అలాగే వైసీపీ కార్యాలయాలపై కూడా స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గత టీడీపీ హయాంలో ఇచ్చిన జీవోల ప్రకారమే పార్టీ ఆఫీసులను నిర్మించామన్నారాయన. అయితే ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. తప్పు చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని టీడీపీ వాదిస్తుంటే.. తమ పార్టీనేతపై అక్రమంగా కేసులు పెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసు సహా.. పలు కేసుల్లో అరెస్టైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రెండు కేసుల్లో కోర్ట్ రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. అయనకు బెయిల్ ఎప్పుడు వస్తుంది? కేసుల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఉత్కంఠగా మారింది. అయితే ఈ అరెస్ట్ చుట్టూ రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారన్నారు. ప్రజాదరణ ఉన్న నాయకుడు, వరుసగా నాలుగుసార్లు గెలిచిన నేత అని ఈ సందర్భంగా తెలిపారు. పిన్నెల్లికి బెయిల్ రాకుండా చేసేందుకు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. 

Share this post

scroll to top