పార్టీ కోసం కష్టపడి పని చేశాను అయినా ఎవరూ తన వైపు చూడటం లేదన్నారు. తాను జనసేనలోకి వెళ్తున్నానని ప్రచారం చేస్తున్నారని బహుశా జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా తనపై ఇలా ఆరోపణలు చేస్తున్నారేమో అని బాలినేని వ్యాఖ్యానించారు. తనకు ప్రజలు మద్దతుగా ఉన్నారని ఎవరికి భయపడేది లేదన్నారు. పార్టీ పట్టించుకోకున్నా సరే తనకు ప్రజలున్నారని పోరాడుతానని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి తాను పార్టీకి దూరంగా ఉన్నానని ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి కనీసం పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. పార్టీకి చెబుదాం అంటే కనీసం వినే పరిస్థితుల్లో లేదన్నారు. భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. భూకబ్జాలు, స్టాంప్స్ కుంభకోణానికి పాల్పడినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై రాజకీయంగా దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మీదే కదా సీబీ సీఐడీ కాదు సీబీఐతో కూడా తనపై విచారణ చేయించాలన్నారు.
జనసేనలోకి వెళ్తున్నానని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం..
