ఏపీ హైకోర్టులో కొడాలి నానికి ఊరట..

kodali-12-.jpg

మాజీ మంత్రి కొడాలి నాని కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. 35(3) కింద నోటీసులు ఇచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు ఉండాలని సూచించింది. విశాఖలో నమోదు అయిన కేసుకు సంబంధించిన ఆయన కోర్టును ఆశ్రయించడంలో న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో వరుసగా వైసీపీ నేతలపై కేసులు, అరెస్ట్ లు జరుగుతున్నా నేపథ్యంలో కొడాలి నానికి కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఓ కేసుకు సంబంధించి ఇటీవల కొడాలి నాని అనుచరులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన కొడాలి నాని ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు. విశాఖలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది.

Share this post

scroll to top