ఏపీ హైకోర్టులో పేర్నినానికి ఊరట..

nani-31-1.jpg

మచిలీపట్నం రేషన్‌ బియ్యం మాయం కేసులో వైసీపీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి పేర్నినానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. నానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. షన్‌ బియ్యం మాయం కేసులో మంగళవారం బందరు తాలుకా పోలీసులు పేర్నినాని ఏ6 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. అతడిని ఏ క్షణంమైనా అరెస్టు చేయవచ్చని పుకార్లు రావడంతో ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్‌లో ముందస్తు పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం పేర్నినానికి ఊరట కలిగించింది.

Share this post

scroll to top