విజయవాడ వరద సహాయకచర్యల నిమిత్తం వైయస్ఆర్‌సీపీ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి విరాళం అందజేశారు. ఈ మేరకు బుధవారం మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌ను ఆయన నివాసంలో కలిసిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి రూ. 10,00,000 చెక్ అందజేశారు. మాజీ ఎమ్మెల్యేను వైయస్ జగన్ అభినందించారు. వరద సహాయక చర్యల్లో పార్టీ శ్రేణులు పాల్గొని నిరాశ్రయులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
వరద సహాయక చర్యలకు మాజీ ఎమ్మెల్యే విరాళం..
