సీనియర్ రాజకీయ నాయకుడు కెంబూరి రామ్మోహన్ రావు(75) ఇవాళ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కెంబూరి రామ్మోహన్ రావు 1985లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా, 1989లో బొబ్బిలి ఎంపీగా గెలుపొంది ప్రజలకు సేవలందించారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చీపురుపల్లిలో కెంబూరి నివాసం వద్ద ఆయన పార్ధివదేహానికి పలువురు జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు అభిమానులు, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత..
