కాంగ్రెస్‌, బీజేపీ నేతల పద్మ అవార్డుల పంచాయితీ..

congrass-28.jpg

తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ తెగడం లేదు. ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్‌ అటు బీజేపీ నేతలు తగ్గేదే లేదంటూ కౌంటర్లు విసురుతున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది. ముమ్మాటికి వివక్షే అని మండిపడుతోంది కాంగ్రెస్‌ పార్టీ. అటు బీజేపీ మాత్రం లిస్ట్‌ పంపించినంత మాత్రాన అనర్హులకు అవార్డులు ఇవ్వాలా అంటూ ప్రశ్నిస్తోంది. ఇలా రిపబ్లిక్‌డే ముగిసినా తెలంగాణలో పద్మ అవార్డులపై రాజకీయ రచ్చమాత్రం చల్లారడం లేదు. ఈ వ్యవహారంపై పొలిటికల్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు వచ్చినప్పుడు తెలంగాణకు కనీసం నాలుగు అవార్డులు కూడా ఇవ్వకపోవడం వివక్ష కాదా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సిఫార్సులను కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు.

Share this post

scroll to top