రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. లక్నోలో ఈ మూవీ టీజర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ సిటీలో ఇంత గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ చేస్తోన్న తొలి పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ కావటం విశేషం. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో టీజర్ లాంచ్ కావటం సర్వసాధారణమైన విషయమే కానీ తొలిసారి ‘గేమ్ చేంజర్’ టీజర్ ను నవంబర్ 9న లక్నో విడుదల చేస్తూ నిజంగానే టైటిల్ కు తగ్గట్టు గేమ్ ను చేంజ్ చేశారు. భారీ అంచనాలున్న గేమ్ చేంజర్ టీజర్ ఈవెంట్ కు రామ్ చరణ్, కియారా అద్వానీ, డైరెక్టర్ శంకర్ సహా సినీ ప్రముఖులందరూ హాజరుకానున్నారు.
లక్నోలో గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్..
