charan-10.jpg

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మూవీ “గేమ్ ఛేంజర్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలోకియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, అంజలి వంటి నటీ నటులు నటించారు. ఈ సినిమా పొలిటికల్ సిస్టంకి, ఓ నిజాయితీ పరుడైన కలెక్టర్‌కు మధ్య జరిగే వార్ అని శంకర్ చాలా సార్లు చెప్పారు. నేడు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సందడి మరింతగా పెరిగింది. సినిమా చూసిన ఫ్యాన్స్ , ప్రేక్షకులు వారి అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ పాస్ అవుతుంది ఇంటర్వెల్ బ్లాక్, సాంగ్స్ అదిరిపోయాయి. సెకండాఫ్ ఊహించనంత లేదు.

ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్ట్‌తో సినిమా చూసే అందరికీ మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ అదే హైలెట్ అవుతుందని అంతా అంటున్నారు. మొత్తానికి గేమ్ ఛేంజర్ యావరేజ్ కిందకే లెక్క అని చెప్పుకోవచ్చు. శంకర్ మార్క్ పాటల పిక్చరైజేషన్ అయితే మతి పోగొడుతుందని చెబుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా రామ్ చరణ్ కొన్ని బ్లాక్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. లవ్ స్టోరీ, కామెడీ ట్రాక్ సరిగా వర్కౌట్ కాలేదని అంటున్నారు. రామ్ చరణ్ యాక్టింగ్, తమన్ బీజీఎం ఫస్ట్ హాఫ్‌ను నిలబెడుతోందని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ ఏదో ఒక మ్యాజిక్ జరగాల్సిందే అని అంటున్నారు. అయితే, అందరూ అప్పన్న పాత్రకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు.

Share this post

scroll to top