గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభ నేని వంశీ. అయితే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 01వ తేదీ వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు. కబ్జా కేసులో వల్లభనేని వంశీ మోహన్ పై నమోదైన కేసులో కోర్టు పీటీ వారెంట్ కు అనుమతి ఇవ్వడంతో గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరిచారు పోలీసులు. విజయవాడ సబ్ జైలులో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకొని గన్నవరం తరలించారు ఆత్మకూరు పోలీసులు. గన్నవరం కోర్టులో వల్లభనేని వంశీని హాజరుపరిచారు. ఆత్మకూరు పీఎస్ లో నమోదైన భూ కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 01 వరకు రిమాండ్ విధించింది కోర్టు. తిరిగి విజయవాడ సబ్ జైలు కు వంశీని తరలించారు పోలీసులు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరో బిగ్ షాక్..
