రైతులకు శుభవార్త..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

jagan-12a.jpg

ఏపీ రైతులకు గుడ్ న్యూస్. సబ్సిడీపై రైతులకు జగన్ సర్కార్ విత్తనాలు అందించనుంది. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 16.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలపై 50 శాతం అలాగే వేరుశనగపై 40 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. దీనికి 450 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. 195 కోట్ల సబ్సిడీ భరించనుంది. పచ్చి రొట్ట, చిరుధాన్యాల విత్తనాల పై 50% అలాగే వేరుశనగ పై 40% సబ్సిడీ ఇవ్వనుంది.

Share this post

scroll to top