ఏపీలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జులై నెలలో భారీ వర్షాలు, వరదల వలన ఏపీవ్యాప్తంగా పలుచోట్ల పంట నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయశాఖఫై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఈ సమావేశంలోనే ఏపీలోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.36 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సూచించారు. ‘అన్నదాత-సుఖీభవ’ పథకం కింద రైతులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈక్రమంలో ఉద్యాన పంటల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అలాగే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులకు సూచించారు. కరవు ప్రాంతాల్లో శాటిలైట్ ఫోటోల ద్వారా మాయిశ్చర్‌ను పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఉద్యానపంటల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు.