లోకేష్ పై ఈ మధ్యకాలంలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నారా లోకేష్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని టిడిపి నేతలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయాలని కోరుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదని ఆయన పరోక్షంగా కామెంట్స్ చేయడం జరిగింది.
తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్ కు వస్తుందని వార్తలపై స్పందించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టిడిపి నేతలు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనడం సరికాదని చురకలాంటించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రస్తుతం ఉన్నారు. అలాంటప్పుడు లోకేష్ కు ఎందుకు ఇవ్వడం అని నిలదీశారు. పార్టీ కోసం కష్టపడ్డ నారా లోకేష్ కు సముచిత స్థానం ఇప్పటికే దక్కిందన్నారు. ఇలాంటి సమయంలో నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనడం సరికాదని టిడిపి పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.