ఎన్నికల సంఘంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ అధికారులు అంపైర్లాగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారిందని ఆరోపించారు. అసలు ఈసీకి తెలియకుండా పిన్నెళ్లి వీడియో బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. ఉద్యోగులంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారని ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం పై ప్రభుత్వ సలహాదారు సజ్జల సీరియస్ కామెంట్స్..!
