కొత్త పింఛన్ల కొసం 2 లక్షల మంది ఎదురు చూపు..

penshion-9.jpg

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లను తొలగించడానికి మాత్రం ఉరుకులు పరుగులు పెడుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడమే కాకుండా వలంటీర్ల వ్యవస్థనే లేకుండా చేసిన కూటమి సర్కారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోంది. తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల జీతాలు రూ.10 వేలకు పెంచుతామని చెప్పి ఏకంగా వలంటీర్ల వ్యవస్థకే మంగళం పాడిన విషయం తెలిసిందే. వలంటీర్ల వ్యవస్థ ఉండి ఉంటే సచివాలయ ఉద్యోగులతో సమన్వయం చేసుకుని పింఛన్ల పంపిణీ, కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియ సవ్యంగా సాగేలా శ్రద్ధ తీసుకునేది. 

అందుకు అవకాశమే లేకుండా చేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా పింఛన్లను తగ్గించాలా అని చూస్తున్నారు. కొత్తగా పింఛన్‌ కోసం 2 లక్షల మంది ఎదురు చూస్తుండ­టాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా వివిధ సాకులు చూపుతూ ఈ ఆరు నెలల్లోనే ఏకంగా 1.57 లక్షల మందికి పింఛన్లు తీసేశారు. ఇది చాలదన్నట్లు అనర్హుల ఏరివేత అంటూ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న లబ్దిదారులపై వేటు వేసేందుకు వెరిఫికేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.  

Share this post

scroll to top