వైఎస్ జగన్ పై గత 15 ఏళ్లుగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తునే ఉన్నారు. ఆదానీ దగ్గర లంచం తీసుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆపకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి పై 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారు. టీడీపీ గెజిట్ పేపర్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే పనిగా తప్పుడు రాతలు రాస్తున్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందం కుదిరింది కేబినెట్లో చర్చిన తరువాత సైకీతో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది.
సైకీతో ఒప్పందం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యయనం చేసిన 45 రోజులు తరువాత ఒప్పదం చేసుకున్నాము. కేంద్ర ప్రభుత్వ సంస్థ సైకీని దళారి సంస్థ అని ఎలా రాస్తారు. విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు 5 రూపాయలకు యూనిట్ విద్యుత్ కంటే వైఎస్ జగన్ 2.49 పైసలకు కొన్నారు. ఎవరి హయాంలో సంపద సృష్టి జరిగింది? వైఎస్ జగన్ ను అదానీ కలిస్తే తప్పు. అదానీ జగనన్ను కలిస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్లు. చంద్రబాబును అదానీ కలిస్తే అది గొప్పగా చెపుతారు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు ఒప్పదం చేసుకున్నది మన రాష్ట్రమే. వైఎస్ జగన్ చేసుకున్న ఒప్పందం తప్పయితే రద్దు చేయొచ్చుగా. రూ.2.49 కంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవచ్చుగా. అధికమొత్తంలో కరెంట్ను కొనుగోలు చేసి రూ.86 వేల కోట్లు భారం వేసిన చంద్రబాబు గొప్పనా రాష్ట్రానికి లక్షా పది వేల కోట్లు మిగిల్చిన వైఎస్ జగన్ గొప్పనా.