పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడుకి, ఎంపీ శ్రీనివాస్ వర్మకు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు హరి రామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. అభివృద్ధి అంటే రాజ్య సాధనాలు, పరిపాలన భవనాలు, నివాస భవనాలు, పార్కులు, కళాభవనాలు ,విశ్రాంతిభవనాలు, నిర్మించడానికి ప్రాధాన్యత కాదని రోడ్లు నిర్మాణం, సాగునీరు, మురుగు కాలువల నిర్మాణం, స్వచ్ఛమైన త్రాగునీరు విద్య, ఆరోగ్య పరిరక్షణతో పాటు వైద్య సౌకర్యం కల్పించడంలో అతి ముఖ్యమైనవని ఈ రకమైన చర్యలు చేపట్టడమే నిజమైన అభివృద్ధి అని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యత వేరుగా ఉందని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.