ఒక్క నెలలోనే అయిదుగురు రైతులు ఆత్మహత్య..

harish-rao-7.jpg

ఇది ఏమాత్రం క్షమార్హం కాదని, రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం మాటలకు పరిమితం అయిందని విమర్శించారు. ముగ్గురు మంత్రులున్న జిల్లాలో నెలలో 5 రైతుల ఆత్మహత్య ప్రయత్నాలా? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రైతేడ్చిన రాజ్యం బాగుపడదని, ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించి కనీసం వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరగకుండా రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఖమ్మం జిల్లాలో గత నెల రోజులుగా 5 రైతులు ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. ఇద్దరు చనిపోయారు. ముగ్గురు చికిత్స పొంది బయటపడ్డారని హరీష్ రావు పోస్ట్‌లో పేర్కొన్నారు.

Share this post

scroll to top