ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలూకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్‌లో ఆ కొత్త థాట్‌ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడినే టార్చ్ బేరర్ అంటారు.’ ఇది సినిమాలోని ఓ డైలాగ్. నిజ జీవితంలో ఇలాంటివారు అరుదుగా ఉంటారు. 2019 – 24 మధ్య ఏపీలో జరిగిన పాలనను చూస్తే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని టార్చ్ బేరర్‌గా చెప్పొచ్చు. ఆ ఐదేళ్లలో ఆయన చేసిన సంస్కరణలు అలాంటివి.
ఎంపీగా మొదలైన వైయస్ జగన్ ప్రస్థానం ఏపీ రాజకీయాలను కొత్త దారిలో నడిపించే స్థాయికి చేరుకుంది. ప్రజలకు మంచి చేసిన నాయ కుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జగన్ మొదటి నుంచీ ప్రజల్లోనే ఉన్నారు. ఆయన పాదయాత్ర చేస్తే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కాలు కదిపాయి. కోట్ల మంది ఓన్ చేసుకున్న లీడర్ జగన్ దేశంలో ఏ నాయకుడూ సాహసం చేయని పనులకు శ్రీకారం చుట్టారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి కాగితాలకు పరిమితం కాలేదు. ఆయన పాలనే విప్లవాత్మక నిర్ణయాలతో మొదలైంది. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేలమంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి రాజకీయ పార్టీలు, కులమతాలకు అతీతంగా పథకాలను అందించారు.