టీకి బదులుగా పరగడుపున తులసి అల్లం నీరు త్రాగండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

helth-27.jpg

కరోనా తర్వాత ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన కేరింగ్ ఎక్కువ అయింది. ఆరోగ్యంగా ఉండటానికి తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటున్నారు. అదే సమయంలో ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి జీవనశైలి, సమయానికి నిద్ర లేవడం, వ్యాయామం చేయడంతో పాటు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలతో రోజును ప్రారంభించడం వంటి మెరుగైన ఉదయం దినచర్యను కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే మన దేశంలో చాలా మంది టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభించేందుకు ఇష్టపడతారు. కాఫీ, టీ బదులుగా కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలతో రోజును ప్రారంభించడం ఆరోగ్యానికి మేలు అని చెబుతున్నారు. రోజు ప్రారంభంలో కొన్ని ఆరోగ్యకరమైన వస్తువులను తీసుకుంటే.. కొన్ని రకాల తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. కనుక ఉదయం పాలు, టీ లేదా కాఫీకి బదులుగా తులసి అల్లం జ్యూస్ ని తాగమని సూచిస్తున్నారు. తులసి, అల్లం రెండూ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తులసి, అల్లం రెండూ ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. ఖాళీ కడుపుతో తులసి, అల్లం నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాదు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం అల్లం, తులసి నీటిని తాగడం ద్వారా అనేక ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.

Share this post

scroll to top