అనుచిత పోస్టింగ్‌లపై కేసులు నమోదు చేయడం లేదు..

rambabu-02.jpg

సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్‌లపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించారు. సోషల్‌ మీడియాలో వైయ‌స్‌ జగన్‌, తన కుటుంబ సభ్యులపై ఐ టీడీపీ అసభ్యంగా పోస్టులు పెట్టిందని ఆయ‌న‌ వేసిన రిట్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్ పర్సన్‌గా హైకోర్టులో అంబటి రాంబాబు తన వాదనలను వినిపించారు. తాను ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషన్‌లో అంబటి రాంబాబు పేర్కొన్నారు. పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్ పరిధిలో 5 ఫిర్యాదులు ఇచ్చాను. ఐదో ఫిర్యాదుపై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదు` అంటూ అంబటి ప్రశ్నించారు. ఐదో ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును ఆయన కోరారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేస్తామని పోలీసుల తరఫు లాయర్‌ తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.

Share this post

scroll to top