నేడు ఏపీ హైకోర్టులో కీలక..

high-court-25.jpg

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఈ రోజు ఓ కీలక కేసులో తీర్పు వెలువరించడంతో పాటు పలు కీలక పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో నేడు తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు కాగా, సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు తేలిపోయింది. తన కేసు కొట్టి వేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ క్వాష్‌ పిటిషన్‌ విచారణలో బాధితురాలు అయిన వరలక్ష్మి కూడా ఇంప్లీడ్‌ అయి తాము రాజీకీ వచ్చామని కేసు అవసరం లేదని చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే అయితే ఈ కేసులో ఈ రోజు తీర్పు ఇవ్వనుంది హైకోర్టు.

Share this post

scroll to top