బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తెల్లవారు జామున తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు గరిష్ఠంగా 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీవ్ర ప్రాంతంలో ఒకటో నంబర్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. వాయుగుండం తీరం దాటడంతో ఉత్తర తమిళనాడు, కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తీరం దాటిన వాయుగుండం..
