ఏపీకి ఒక గండం తప్పిందని అనుకునే లోపే మరో ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ బాంబ్ పేల్చింది. ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది తుపానుగా మారే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. అది వాయువ్య దిశగా కదులుతూ 22 నాటికి అల్పపీడనంగా బలపడనున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. అలాగే తెలంగాణలో కూడా జోరువానలు కురుస్తాయని, హైదరాబాద్ లో మోస్తరు వర్షం పడే అవకాశాలున్నాయని వివరించింది. ఈ నెల 21వ తేదీనుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీకి ముంచుకొస్తున్న తుపాన్..
