వర్షాలు ఇప్పట్లో పోయేలా లేవు. ఎందుకంటే ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరుగా కురుస్తాయని తెలియజేస్తోంది. తెలంగాణలో 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉన్నాయని పేర్కొంది. ఇప్పటికే 4 రోజులుగా అక్కడక్కడా తేలికపాటి వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో మంగళ, బుధ, గురు వారాలలో కూడా అంటే మరో 3 రోజులు పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందువల్ల ప్రజలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. హైదరాబాద్ జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చు. మరీముఖ్యంగా యాదాద్రి– భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ్‌పేట, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. అలాగే ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలు పడొచ్చని హెచ్చరించింది.
ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు.. ప్రజలు అప్రమతంగా ఉండాలి..
