జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి.. 

pennili-24.jpg

ఏపీ హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డికి నిన్న బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఈరోజు విడుదల కానున్నారు. గత కొన్ని రోజులుగా రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు పిన్నెల్లి. ఈరోజు ఆయన బెయిల్‌పై జైలు నుంచి విడుదల కానున్నారు. నిన్న సమయం మించిపోవడంతో నిబంధనల మేరకు జైలు అధికారులు విడుదల చేయలేదు. ఈ క్రమంలో నెల్లూరు జైలు వద్దకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇతర నేతలు చేరుకున్నారు. ఈరోజు ఉదయం జైలు వద్దకు పిన్నెల్లి అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వారిని పోలీసులు జైలు ప్రాంగణం నుంచి బయటకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

Share this post

scroll to top